Avopa News

నాగర్ కర్నూల్ అవోపా యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు    సైన్స్ టాలెంట్ టెస్ట్,   ఉపన్యాస, వ్యాసరచన   మరియు క్విజ్ అంశాలలో పోటీలు నిర్వహించబడ్డాయి. ముఖ్యఅతిథిగా  విచ్చేసిన  పాలమూరు  అవోపా జోనల్ చైర్మన్ బొడ్డు పాండు గారిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మరియు  నాగర్కర్నూలు   డిస్ట్రిక్ట్  అవోపా వైస్ ప్రెసిడెంట్  దర్శి రాజయ్య గారి చే  మరొక  వైస్ ప్రెసిడెంట్  కందూరు బాలరాజు గారి చే  బహుమతులు  అందజేయ బడ్డాయి 
ఈ సందర్భంగా  ముఖ్యఅతిథి  ప్రధాన వక్త  బొడ్డు పాండు గారు మాట్లాడుతూ  నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యత  మరియు భారతీయ , పాశ్చాత్య శాస్త్రవేత్తల గురించి  సవివరంగా తెలియజేశారు 
దర్శి రాజయ్య గారు మాట్లాడుతూ  విద్యార్థులు సైన్స్ పట్ల  అవగాహన పెంచుకోవాలని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు కావాలని కోరారు. కందూరి బాలరాజు గారు  మాట్లాడుతూ సి వి రామన్  గారు  భారతరత్న  మరియు  నోబెల్ పురస్కారం పొందిన  గొప్ప శాస్త్రవేత్త  అని  తెలియజేశారు. సైన్స్ ఉపాధ్యాయులు జగన్మోహన్ గారు  సుజాత గారు విజ్ఞాన శాస్త్రం పట్ల  విద్యార్థులు అభిరుచిని పెంచుకోవాలని సూచించసారు