నమ్మకానికి ప్రతిరూపం, ప్రతిభా పాఠవాలకు, అకుంఠిత దీక్షా దక్షతకు పెట్టింది పేరైనా తెలంగాణ రాష్ట్ర అవోపా మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి ఆర్యవైశ్య వధూవరుల వివాహ పరిచయ వేదికను హైదరాబాదులో నిర్వహించాలనే బృహత్తర కార్యక్రమం చేస్తున్నది. కేవలం సమాజసేవలో మా వంతు కృషి చేయాలని సంకల్పముతో చేపట్టుతున్న ఈ వివాహ పరిచయ వేదికకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. కావున రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుండి విదేశాలలో నివసిస్తున్న అన్ని స్థాయిల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకోగలరని కోరుచున్నాము. వెయ్యి రూపాయల (Rs.1000/-) రిజిస్ట్రేషన్ ఫీజు QR code ద్వారా చెల్లించి వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోగలరు.